Home Entertainment ఆమె గొంతు తీయన, మనసేమో చల్లన

ఆమె గొంతు తీయన, మనసేమో చల్లన

74
0
SHARE
బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ పేద పిల్లలకు సాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. చేయి చాచి అడిగిన పిల్లలకు లేదనకుండా సాయం చేసి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన నేహా దగ్గరికి ఇద్దరు వీధిబాలలు చేరుకుని టిష్యూ పేపర్లు కొనమని కోరారు. దీంతో ఈ గాయని ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే రూ.2 వేల నోట్లను తీసి వారి చేతిలో పెట్టింది. ఇలా వీధిబాలలకు సాయం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె దాతృత్వానికి పొంగిపోయిన అభిమానులు నేహాను పొగడ్తలతో ముంచెత్తారు.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In